ఇదొక అప్డేటా? 'Project K’ దీపికా పదుకొనే ఫస్ట్‌ లుక్‌ పై విమర్శలు

Update: 2023-07-18 04:34 GMT

ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే 'ఆదిపురుష్' ఫీవర్ నుంచి కోలుకుంటున్నారు. ఇక రాబోయే సినిమాల్లోనైనా తమ అభిమాన హీరో యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొడతారనే ఆశతో ఉన్నారు. ఈ క్రమంలో ప్రభాస్ కొత్త సినిమా ప్రాజెక్ట్ K(Project K)పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నాగ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే(Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్(Amitabh), కమల్ హాసన్(Kamal Haasan), దిశా పటాని(Disha Patani).. మరికొంతమంది స్టార్లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జులై 21న ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ హాలీవుడ్ ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించి సినిమాకు మరింత హైప్ తెచ్చారు చిత్రయూనిట్.

అయితే ఈ సినిమా నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ చెప్పిన టైంకి రిలీజ్ చేయకుండా నాలుగు గంటల తర్వాత ఆలస్యంగా నిన్న రాత్రి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో దీపికా పదుకొనే ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ ఫోటోలో కేవలం దీపికా ఫేస్ మాత్రమే ఉంది. అది కూడా బయట దిగితే ఎలా ఉంటుందో అంతే మాములుగా ఉంది. ప్రాజెక్ట్ K యూనిట్ ఇచ్చిన ఈ అప్డేట్ చూసి అటు దీపికా అభిమానులతో పాటు, ప్రభాస్ అభిమానులు కూడా నిరాశ చెందారు.

దీంతో చిత్రయూనిట్ పై సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. దీన్ని అప్డేట్ అంటారా? ఈ పాస్ పోర్ట్ ఫోటో కోసం మళ్ళీ నాలుగు గంటలు లేట్? అసలు ఫస్ట్ లుక్ అంటే ఎలా ఉంటుందో తెలుసా అంటూ అభిమానులు ప్రాజెక్ట్ K మూవీ యూనిట్ పై విమర్శలు చేస్తున్నారు. మరికొందరైతే... సంతోషం.. కేవలం చేతులు చూపించి ఇదే అప్డేట్ అని అనలేదు.. అని కౌంటర్లు వేస్తున్నారు. మీకు రిలీజ్ చేయడం ఇష్టం లేకపోతే చేయొద్దని.. అంతేకానీ ఏదీ పడితే అది పెట్టి ఆదిపురుష్ టీమ్ లాగా ఫ్యాన్స్ తో ఆడుకోవద్దని హెచ్చరించారు ఇంకొందరు. ఇక జులై 21న రిలీజ్ చేయబోయే టైటిల్, గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.


A hope comes to light, for a better tomorrow.

Tags:    

Similar News