సుహాస్ 'కేబుల్ రెడ్డి'.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Update: 2023-09-21 08:21 GMT

షార్ట్‌ ఫిలింస్‌, యూట్యూబ్‌ వీడియోస్‌తో కెరీర్‌ ప్రారంభించి చిన్న చిన్న పాత్రలు వేస్తూ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్‌. డిఫ్రంట్ బేస్ వాయిస్‌తో చెప్పె డైలాగులు, చక్కని యాక్టింగ్‌తో ఆకట్టుకొని ‘కలర్‌ ఫోటో’ సినిమాలో హీరోగా ఛాన్స్ కొట్టేశాడు. ఆ సినిమా మంచి సక్సెస్‌ సాధించడంతో.. అతనికి వరుసగా హీరో అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే రైటర్‌ పద్మభూషణ్‌ (Writer Padmabushan) సినిమాతో ఫర్వాలేదనిపించుకున్నాడు. ప్రస్తుతం సుహాస్‌ చేతిలో మూడు, నాలుగు సినిమాలున్నాయి. అందులో కేబుల్‌ రెడ్డి (Cable Reddy) ఒకటి.

సుహాస్‌, షాలిని కొండేపూడి (Shalini Kondepudi) జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఫ్యాన్‌ మేడ్‌ ఫిల్మ్స్‌ (Fan Made Films) పతాకంపై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తుండ‌గా.. శ్రీధర్‌ రెడ్డి (Sridhar Reddy) దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ క్ర‌మంలో ఈ మూవీ నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్ . ఈ విష‌యాన్ని తెలుపుతూ.. కేబుల్‌ రెడ్డి నవ్వులతో మీ గుండెకి కనెక్షన్ ఇచ్చేస్తాడు అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ సినిమాను 2024 స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు



Tags:    

Similar News