సోలో లైఫే సో బెటర్ అంటున్న శర్వానంద్..‘మనమే’ సాంగ్ ఎలా ఉంది?

By :  Shabarish
Update: 2024-03-28 07:03 GMT

కొంత గ్యాప్ తర్వాత మనమే అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు హీరో శర్వానంద్. తన 35వ సినిమాను డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. శర్వా సరసన ఇందులో కృతిశెట్టి నటిస్తోంది. ఈ మధ్యనే ఈ మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా నేడు తొలి సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'ఇక నా మాటే అంటూ' సాగే పాట ఆకట్టుకుంటోంది. మెలోడీ మెజీషియన్ హేశం అబ్దుల్ వాహబ్ ఈ మూవీకి సంగీతం అందించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ హిట్ అవ్వడం ఇప్పుడు శర్వాకు చాలా అవసరం. ఈ మధ్యనే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో ఓ పాపను కూడా చూపించారు. అంటే ఈ స్టోరీ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో ఉంటుందా? అనే డౌట్ అందరికీ అప్పుడే వచ్చుంటుంది. తాజాగా రిలీజ్ చేసిన నా మాటే అంటూ పాట ఫారిన్ లోకేషన్స్‌లో షూట్ చేశారు. ఇందులో హీరోయిన్ కృతిశెట్టి లేదు.

ఉల్లాసంగా హీరో పాడుకునే ఓ సింగిల్ లైఫ్ కుర్రాడి పాటగా కనిపిస్తోంది. సోలో లైఫే సో బెటర్ అంటూ  శర్వానంద్ వేసే స్టెప్పులు అట్రాక్ట్ చేస్తున్నాయి. కృష్ణ చైతన్య రాసిన ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక 'మనమే' మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అవ్వడంతో త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించనున్నారు. 

Full View

Tags:    

Similar News