సినీ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఒకే రోజు ఏకంగా 9 సినిమాలు రిలీజ్

Byline :  Shabarish
Update: 2024-03-14 09:31 GMT

ఫ్రైడే వచ్చిందంటే చాలు సినీ లవర్స్‌కు పండగ వచ్చినట్లే. ప్రతి శుక్రవారం విడుదలయ్యే కొత్త సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా రేపు ఒకేసారి ఏకంగా 9 సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నారు. లాస్ట్ వీక్ గామి, ప్రేమలు మంచి హిట్ సాధించాయి. ఇక ఇప్పుడు ఈ వారం ఏ సినిమాలు సక్సెస్ అవుతాయో చూసేందుకు రెడీ అయిపోండి. ఇక ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ చూస్తే..


1 .చైతన్య రావు, భూమి శెట్టి జంటగా ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

2.పూరీ తమ్ముడు హీరో సాయిరామ్ శంకర్ చాలా గ్యాప్ తర్వాత ‘వెయ్ దరువెయ్’ సినిమాతో వస్తున్నాడు.

3.నిజాం సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన కథాంశంపై తెరకెక్కిన ‘రజాకార్’ మూవీ రిలీజ్ కానుంది.

4.అనన్య నాగళ్ళ మెయిన్ లీడ్‌లో చేస్తున్న హారర్ సినిమా ‘తంత్ర’ కూడా విడుదల కానుంది.

5.బిగ్ బాస్ ఫేమ్ దివి నటించిన లవ్ థ్రిల్లర్ స్టోరీ ‘లంబసింగి’ రిలీజ్ అవుతుంది.

6.హీరో త్రిగున్ ‘లైన్ మెన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

7.హీరోయిన్ ఎస్తర్ నోరాన్హా ‘మాయ’ సినిమా విడుదలవుతోంది.

‘రవికుల రఘురామ’, ‘స్వామి నాగుల కొండ’.. అనే చిన్న సినిమాలు కూడా రిలీజవుతున్నాయి.

మరి ఈ సినిమాలు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో లేదోనని తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.

Tags:    

Similar News