మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ ఫిక్స్

Update: 2023-08-14 12:54 GMT

చాలా కాలం తరువాత వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. జాతిరత్నం ఫేమ్ నవీన్ పోలిశెట్టితో జోడీ కట్టి మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి అంటూ ఫుల్‎లెన్త్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైంది స్వీటీ. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ అనుష్క ఫ్యాన్స్‎లో అంచనాలను పెంచాయి. చాలా కాలంగా మూవీ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు మేకర్స్ మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్స్‏ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రంశ్రీకృష్ణ జన్మాష్టమి రోజున విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. ముందు ఆగస్టు 4న సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‎లో ఉండటంతో వర్కౌట్ కాలేదు. దీంతో సినిమాను వాయిదా వేశారు. తాజాగా సినిమా లేటెస్ట్ రిలీజ్ డేట్‎ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న వెండితెర మీద సందడి చేయబోతోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




 


సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా విడుదలైన టీజర్‎ను బట్టి చూస్తే ఈ మూవీలో అనుష్క ప్రొఫెషనల్ చెఫ్ అని అర్థం అవుతోంది. ఇక నవీన్ ఓ స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నాడు. వీరిద్ద మధ్య సాగే కథే ఈ సినిమా అని తెలుస్తోంది. టీజర్‎లో ఇదే విషయాన్ని మరింత ఆసక్తికరంగా చూపించారు మేకర్స్. అనుష్క, నవీన్ మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు ఎంతో ఫ్రెష్‎గా ఉన్నాయి. అనుష్క చాలా కాలం తరువాత స్క్రీన్ మీద కనిపించనుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయా భాషలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు.





Tags:    

Similar News