తెలుగు రాష్ట్రాల్లో.. సలార్ టికెట్ రేట్లు పెంపు

Byline :  Bharath
Update: 2023-12-19 13:53 GMT

మరో మూడు రోజుల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా వ్యాప్తంగా ఇప్పటికే రిలీజ్ అయిన టికెట్లు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా బుక్కింగ్స్ ఓపెన్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. దీంతో టికెట్లు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సంధ్య థియేటర్లలో ఆఫ్ లైన్ లో టికెట్లు అమ్మినట్లు తెలుస్తుంది. దీంతో అభిమానులు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో భారీగా గుమిగూడారు.

ఈ క్రమంలో సలార్ టికెట్ రేట్లను పెంచేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో రూ.100, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.65 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. ఏపీలోనై టికెట్ ధరలు రూ.40 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే తెలంగాణలో పెరిగిన టికెట్ ధరలు.. డిసెంబర్ 22 నుంచి 28 వరకే అమలులో ఉంటాయి. అంతేకాకుండా 20 థియేటర్లలో మాత్రమే అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోకు అనుమతిచ్చింది. సాధారణ ప్రదర్శనలతోపాటు అదనంగా ఉదయం 4 గంటల నుంచి ఆరో ఆట ప్రదర్శించుకోవచ్చని డిస్టిబ్యూటర్లకు వెసులుబాటు కల్పించింది. ఏపీలోనూ సినిమా విడుదలైన 10 రోజుల వరకే పెంచిన టికెట్ రేట్లు అమలులో ఉంటాయి. 

Tags:    

Similar News