అన్యాయం జరిగితే ఊరుకోను-గుణశేఖర్

Update: 2023-07-20 10:16 GMT

ప్రాజెక్ట్ కె కోసం నాగఅశ్విన్ టీమ్ తో పాటూ అమెరికా వెళ్ళిన రానా అక్కడ తన నెక్స్ట్ మూవీ గురించి అనౌన్స్ చేశాడు. హిరణ్య కశిప అనే టైటిల్ తో...త్రివిక్రమ్ కథతో తనే నిర్మాతగా సినిమా వస్తుందని చెప్పాడు. అమరచిత్రకథ అనే కామిక్స్ ఆధారంగా చేసుకుని త్రివిక్రమ్ కథ తయారు చేస్తున్నారని రానా ప్రకటించాడు. అయితే డైరెక్టర్ ఎవరననది మాత్రం చెప్పలేదు. కానీ ఇంతలోనే దర్శకుడు గుణశేఖర్ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. తన సినిమాను వేరే వాళ్ళు చేస్తే ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఒక సినిమా చేస్తున్నారు అంటే దేవుడు మీ ఇంటిగ్రిటీ మీద ఒక కన్నేసి ఉంచుతాడని గుర్తుపెట్టుకోండి అంటూ ఫేస్ బుక్ లో గుణశేఖర్ ఒక పోస్ట్ పెట్టారు. ఇందులో ఆంధ్రలోని అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం , అక్కడ తాను ఉన్నట్టు ఉన్ ఫోటోను షేర్ చేశారు. అధర్మంగా చేసిన అన్ని పనులకు ధర్మంగానే సమాధానం దొరుకుతుంది అంటూ కామెంట్ చేశారు. హిరణ్య కశిప అనే సినిమాను ముందు గుణశేఖర్ అనుకున్నారు. శాకుంతలం టైమ్ లోనే దీని గురించి చెప్పారు కూడాను.

తాను ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు చేయలేకపోతే తప్పుకోవాలి అంతే కానీ వేరే వాళ్ళతో దానిని ముందుకు తీసుకెళ్ళకూడదని....తనకు అన్యాయం జరిగితే ఏ మాత్రం వదిలే ప్రసక్తి లేదని గుణశేఖర్ వార్నింగ్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్, దర్శకుడు అన్న మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. దీని మీద త్రివిక్రమ్ టీమ్ కానీ, రానా నుంచి కానీ ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు నెటిజన్లు.

Full View

Tags:    

Similar News