మహేశ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. గుంటూరు కారం ప్రీ రిలీజ్ వాయిదా
మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా 'గుంటూరు కారం'. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల కానుంది. మహేశ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 6న హైదరాబాద్లో జరుగుతుందని మూవీ యూనిట్ ప్రకటించింది. తాజాగా అనివార్య కారణాల వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేస్తున్నట్లు గుంటూరు కారం చిత్ర యూనిట్ ప్రకటించింది.
"జనవరి 6న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమైనా.. అనివార్య కారణాలు, సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని చెప్పేందుకు చింతిస్తున్నాం. ప్రీ రిలీజ్ కొత్త తేదీ, వేదిక గురించి త్వరలోనే ప్రకటిస్తాం" అని గుంటూరు కారం మూవీ టీం ప్రకటించింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజునే ఆ వేదికపై నుంచే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ నిర్ణయించింది. గుంటూరు కారంలో మహేశ్ బాబును త్రివిక్రమ్ ఇంతకు ముందు చూడని విధంగా ఈ సినిమాలో చూపించనున్నాడు. మహేశ్ బాబు ఇంతవరకూ వేయని నాటు స్టెప్పులను ఈ సినిమాలో వేయించాడు. సినిమాకు తమన్ సంగీతాన్ని అందించగా.. ఇప్పటి వరకు రిలీజైన పాటలన్నీ జనంలోకి దూసుకుపోయాయి. ముఖ్యంగా 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ ఒక ఊపు ఊపేస్తోంది.