Guntur Karam Movie : గుంటూరు కారం.. అర్థరాత్రి నుంచే దందా మొదలు

Byline :  Babu Rao
Update: 2024-01-09 09:44 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన గుంటూరు కారం సినిమా 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు ఎలా ఉన్నా.. ట్రైలర్ ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపింది. దీంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, వెన్నెల కిశోర్, జగపతిబాబు, సునిల్ కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి బరిలో మరో మూడు సినిమాలున్నా.. పెద్ద సినిమాగా మాత్రం గుంటూరు కారం నిలుస్తోంది. ఇక ఓ టాప్ హీరో సినిమా అంటే ప్రీమియర్ షోస్ హడావిడీ ఉంటుంది కదా.. అందుకే తెలంగాణలో ఈ చిత్రానికి స్పెషల్ షోస్ కేటాయించారు. రిలీజ్ కు ముందు అర్థరాత్రిపూట తెలంగాణ వ్యాప్తంగా 23థియేటర్స్ కు పర్మిషన్ ఇచ్చారు. అంటే గుంటూరు కారం హడావిడీ అర్థరాత్రి నుంచే మొదలు కాబోతోందన్నమాట. అలాగే ఉదయం నాలుగు గంటలకే మొదలయ్యే షో తో పాటు ఒక వారం రోజుల పాటు ఆరు షో స్ ప్రదర్శించేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంతే కాదు.. టికెట్ రేట్లను కూడా భారీగా పెంచుకునేందుకు అనుమతిచ్చారు.




 


సింగిల్ స్క్రీన్స్ లో 250 రూపాయలు, మల్టీ ప్లెక్స్ ల్లో 410 రూపాయలు టికెట్ ధరలు ఖరారు చేశారు. ఇవి ఒక వారం పాటు అమలులో ఉండే ధరలు అన్నమాట. ఈ టికెట్ రేట్లు చూస్తే పండగ పూట సామాన్యుడి జేబుకు చిల్లులు పడటం ఖాయం అనిపిస్తుంది. గ్రాఫిక్స్ అంటూ, విజువల్ ఎఫెక్ట్స్ అంటూ ఏ ప్రత్యేకతా లేని ఈ చిత్రానికి అంత మొత్త రేట్లు పెంచేందుకు ఎలా అనుమతిచ్చారో కానీ.. ఖచ్చితంగా ఇది ఓ పెద్ద దందాగానే చూడాలి. ఈ రేంజ్ లో రేట్లు పెంచుకుని ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్స్ అని చెప్పుకోవడం.. లేదంటే ఓవరాల్ కలెక్షన్స్ గురించి మాట్లాడటం అనేది ప్రేక్షకులను, అభిమానులను దోచుకుని చేసుకునే సంబరం అనే చెప్పాలి. ఏదేమైనా పండగ అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలనుకోవడం దారుణం అనే చెప్పాలి.


Tags:    

Similar News