Gunturukaram Movie : గుంటూరు కారం సెన్సార్ పూర్తి.. సినిమా ఎన్ని గంటలంటే
సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ తర్వాత ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో దాదాపు పదమూడేళ్ల తర్వాత వస్తోన్న సినిమా కూడా కావడంతో మరిన్ని అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకునేందుకు సంక్రాంతి బరిలో నిలిచారు. ఇక తాజాగా గుంటూరు కారం మూవీ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది.
గుంటూరు కారంలో యాక్షన్ డోస్ ఎక్కువగానే ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమైంది. అందుకే యూ /ఏ వచ్చింది. ఇక ఈ మూవీ 2 గంటల 39 నిమిషాల నిడివితో వస్తోంది. ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువ లెంగ్త్ ఉన్నా ఆడియన్స్ చూస్తున్నారు. కాకపోతే కంటెంట్ బలంగా ఉండాలంతే. గుంటూరు కారం యద్ధనపూడి సులోచనారాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవలకు అనుకరణగా వస్తోందనే కమెంట్స్ ఉన్నాయి. అవన్నీ నిజమా కాదా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. మొత్తంగా గుంటూరు కారంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, వెన్నెల కిశోర్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ మూవీపై ఉన్న అంచనాలు నిజమవుతాయా లేదా అనేది చూడాలి.