జై హను మాన్ లో తేజ సజ్జా లేడా..

Byline :  Babu Rao
Update: 2024-01-23 08:27 GMT

హను మాన్.. ఈ మధ్య కాలంలో రాజమౌళి తర్వాత తెలుగు సినిమాను ప్రపంచ పటంపై నిలబెట్టిన సినిమా. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండియన్ సూపర్ మేన్ హనుమాన్ శక్తిని కొత్తగా చూపించింది. ఈ కోణంలో ఇప్పటి వరకూ ఎవరూ ప్రెజెంట్ చేయలేదా అంటే చేశారు. కృష్ణవంశీ గతంలోనే శ్రీ ఆంజనేయం అంటూ తీశాడు. కానీ అందులో భక్తి కంటే రక్తి ఎక్కువ కావడంతో ఆడియన్స్ కు అంతగా నచ్చలేదు. హను మాన్ లో ఆ ప్రాబ్లమ్ లేకుండా చూసుకున్నాడు. ఒక సింపుల్ ప్లాట్ కు హను మాన్ శక్తిని ఆపాదించి ఆ ఇంపాక్ట్ ఆడియన్స్ లో కలిగించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు ప్రశాంత్.

అందుకే ఈ మూవీ బాక్సాఫీస్ ను కొల్లగొడుతోంది. చాలా చిన్న బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 200 కోట్లు వసూళ్లు సాధించడం అంటే చిన్న విషయం కాదు. మన ఇండియన్ సూపర్ హీరో రేంజ్ లో ఏంటో కూడా ప్రూవ్ చేసింది హను మాన్. అయితే భారత ఇతిహాసాల్లోని భరత వర్ష ఆధారంగా మరికొన్ని భాగాలను కూడా రూపొందించబోతున్నాడు ప్రశాంత్. ఈ మేరకు రెండో భాగానికి జై హను మాన్ అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశాడు. అయితే ఈ పార్ట్ లో తేజ సజ్జా హీరో కాదట. మరో స్టార్ హీరో ఈ పార్ట్ లో నటించబోతున్నాడని టాక్. అయితే హను మంతు పాత్ర కూడా ఉంటుందట. అయితే రెండో పార్ట్ లో ఆ పాత్రకు అస్సలేమంత ప్రాధాన్యం ఉండదు అని చెబుతున్నారు. హను మాన్ తో వచ్చిన క్రేజ్ చూసిన తర్వాత ఇక ఏ స్టార్ కూడా ప్రశాంత్ వర్మ టాలెంట్ పై డౌట్ పెట్టుకోడు. అందుకే ఈ సారి ఓ స్టార్ తో తన రెండో భాగాన్ని రూపొందించబోతున్నాడట. మరి తేజ సజ్జా చివర్లో వస్తాడా లేక.. ముందే ఆ పాత్రను క్లోజ్ చేస్తారా అనేది చూడాలి.

Tags:    

Similar News