Shahid Kapoor : స్టార్ హీరోకు వేధింపులు..ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్

Byline :  Shabarish
Update: 2024-03-01 04:56 GMT

స్టార్ హీరో షాహిద్ కపూర్ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పలు హిట్ సినిమాలు చేసిన ఈ కుర్ర హీరో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తన తల్లిదండ్రులు సీరియల్స్‌లో నటిస్తున్నప్పటికీ వారి పేరును వాడుకోకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. బాలీవుడ్‌లో కబీర్ సింగ్, జెర్సీ, బ్లడీ డాడీ వంటి సూపర్ హిట్స్ అందుకున్నాడు. అయితే తన కెరీర్ మొదట్లో ఇండస్ట్రీలో తనను బయటివ్యక్తిలాగానే చూసేవారని, ఎన్నో అవమానాలు, వేధింపులు ఎదుర్కొన్నానని షాహిద్ కపూర్ ఎమోషనల్ అయ్యారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్ మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన ఆరోపణలు చేశారు. తనపట్ల ఇండస్ట్రీలోని కొందరు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువగా ఉంటుందని, ఇతరులకు అవకాశాలు రావని అన్నారు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు.

ఇతరులను ఎదగకుండా చేయడం, అవమానించడం మంచి పద్దతి కాదన్నారు. టీజేజీలో తనకు పోరాడే శక్తి లేదని, కానీ ఇప్పుడు తనను ఎవరైనా వేధించాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోనని అన్నారు. ఒకవేళ అలాంటి వారు ఉంటే, వేధించి ఆనందించేవాళ్లను ఉంటే తాను కూడా వేధిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం షాహీద్ కపూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. నెటిజన్లు ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News