Harish Rao : బిగ్ బాస్7 విజేతగా రైతు బిడ్డ.. హరీష్ రావు రియాక్షన్ ఇదే

Byline :  Krishna
Update: 2023-12-18 05:59 GMT

బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా చరిత్ర సృష్టించాడు పల్లవి ప్రశాంత్. అన్నా మల్లొచ్చినా.. అన్నా రైతు బిడ్డనన్నా.. అన్నా నన్ను బిగ్ బాస్‌లోకి తీసుకోండన్నా’ అని ఏడుపు మొఖంతో, వింత చేష్టలతో వీడియోలు పెడుతుంటే వీడెవడ్రా బాబూ.. పిచ్చోడి మాదిరిగా ఉన్నాడని అంతా అనుకున్నారు. నవ్విన నోళ్లే మూతపడేలా.. తన గెలుపుతో అందరికీ షాక్ ఇచ్చాడు. టైటిల్ గెలిచాక తాను గతంలో చెప్పినట్లుగానే ప్రైజ్ మనీని రైతులకే ఇస్తానని ప్రకటించి అందరినీ మనసులను ఆకట్టుకున్నాడు. కాగా అతడికి అభినందనల వెల్లువ కొనసాగుతోంది.

పల్లవి ప్రశాంత్ను అభినందిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక ట్వీట్ చేశారు. ‘‘విజేతగా నిలిచిన మా సిద్దిపేటకు చెందిన 'రైతు బిడ్డ' పల్లవి ప్రశాంత్‌కు అభినందనలు. పల్లవి ప్రశాంత్ అనేది రైతు ఇంటి పేరుగా మారింది. ఈ సీజన్‌లో సామాన్యుల దృఢత్వానికి అతడు ప్రతీకగా నిలిచాడు. పొలం నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది’’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు.




Tags:    

Similar News