తమిల్, తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న నటుల్లో హీరో ధనుష్ ఒకరు. బ్యాక్ గ్రౌండ్ ఉన్న... సొంత టాలెంట్‌తో పైకి వచ్చి తన కంటూ ఓ ట్రెండ్ సెట్ చేసుకున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ విజయాలను సొంతం చేసుకున్నాడు. రఘువరన్ బీటెక్ సినిమాతో యువకులకు రోల్ మోడల్‌గా మారిపోయాడు ధనుష్. ఇక రీసెంట్గా తెలుగులో సార్ సినిమాతో స్సెన్సేషన్ క్రియేట్ చేశాడు.ఇది ఇలా ఉంటే తాజాగా ధనుష్ ఇబ్బందుల్లో పడ్డాడు. ధనుష్‌పై నిషేధం విధించడానికి ‘తమిళ్‌నాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తేనేండాళ్ ఫిలింస్ ఫిర్యాదు మేరకు తమిళనాడు నిర్మాతలు చర్యలు చేపట్టారు. ధనుష్ తన దర్శకత్వంలో శ్రీ తేనాండాళ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిపై 2017లోనే అధికారిక ప్రకటన వెలువడింది. కానీ కొన్ని కారణాలతో ధనుష్ ఆ సినిమా చేయలేదు. ఇప్పటికీ స్పందించకపోవడంతో శ్రీ తేనాండాళ్ ఫిల్మ్స్ ..తమిళ్‌నాడు నిర్మాత మండలికి ఫిర్యాదు చేసింది. దీంతో నిర్మాతల మండలి ధనుష్‌కు నోటీసులు జారీ చేసింది.ధనుష్ నుంచి ఎటువంటి వివరణ రాకపోతే రెడ్ కార్డ్ జారీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవలే హీరో విశాల్, శింబు, ఎస్‌జే సూర్యకు సైతం ఇలాంటి చిక్కుల్లోనే పడ్డారు. వారికి నిర్మాత మండలి రెడ్ కార్డ్ జారీ చేసింది.