గుడ్ న్యూస్ చెప్పిన నిఖిల్

By :  Babu Rao
Update: 2024-02-21 09:46 GMT

హీరో నిఖిల్ సిద్ధార్థ్ కొన్నాళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతని భార్య పల్లవి డాక్టర్. 2020 మే 14న వీరి పెళ్లైంది. మంచి దంపతులు అనిపించుకున్న వీళ్లు విడిపోతున్నారు అనే వార్తలు కూడా ఆ మధ్య వచ్చాయి. బట్ అవేం లేవని ఖండించిందీ జంట. రీసెంట్ గా తన భార్య గర్భవతి అని శ్రీమంతం ఫోటోస్ ను షేర్ చేశాడు నిఖిల్. తాజాగా వీరిక మగ పిల్లాడు పుట్టాడు. ఈ విషయాన్ని తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసుకున్నాడు నిఖిల్. తన కొడుకును ఎత్తుకుని ఉన్న ఫోటోను షేర్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నాడు నిఖిల్.

కార్తికేయ2తో ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ కు గ్రాండ్ గా పరిచయం అయ్యాడు నిఖిల్. ఈ మూవీ అనూహ్యంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన 18పేజెస్, స్పై సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయినా ఇప్పుడు మరో రెండు ప్యాన్ ఇండియన్ మూవీస్ తో వస్తున్నాడు. వీటిలో ఒకటి స్వయంభు. హిస్టారికల్ ఫిక్షన్ కంటెంట్ తో వస్తోందీ మూవీ. మరోటి ద ఇండియా హౌస్. ఇది కూడా కొన్ని చారిత్రక అంశాలతో రూపొందుతున్న సినిమానే. ఈ రెండు సినిమాలూ యాక్షన్ కు ప్రాధాన్యం ఉన్న కథలే అంటున్నారు.

Tags:    

Similar News