యంగ్ రెబెల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. జులై 20న కాలిఫోర్నియాలోని జరుగనున్న శాన్ డియాగో కామిక్-కాన్ 2023 వేడుకలో ప్రాజెక్ట్ కె ప్రచార చిత్రాన్ని లాంచ్ చేయనుంది మూవీ యూనిట్. ఈ ఘనత దక్కిన ఫస్ట్ ఇండియన్ మూవీగా ప్రాజెక్ట్ కె హిస్టరీ క్రియేట్ చేయనుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో దీపికా పదుకోన్ ప్రభాస్‌తో జోడీ కట్టింది. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శాన్ డియాగో కామిక్ వేదికపైన మూవీకి సంబంధించిన టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేయనున్నారు. ఆ తరువాత సినిమాకు చెందిన పలు విషయాలను పంచుకోనున్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌లో ప్రాజెక్ట్-కే అంటే ఏమిటి? అనే ఆసక్తి పెరిగింది. అంతేకాదు మూవీ మేకర్స్ కూడా ప్రాజెక్ట్-కే అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అంటూ ట్వీట్స్ చేస్తూ తెగ ఊరిస్తున్నారు. దీంతో ఈ మూవీ టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మొదట ప్రాజెక్ట్-కే అంటే 'కర్ణ, కల్కీ' అనే పేర్లు వైరల్ అయ్యాయి. కానీ సైన్స్ ఫిక్షన్ - టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌గా బేస్ చేసుకునికానీ వస్తున్న సినిమా కావడంతో ప్రాజెక్ట్ కె, కు ప్రాజెక్ట్ 'కాలచక్ర' అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు సమాచారం. మరి టైటిల్‌పై ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మాత్రం జులై 20 వరకు వెయిట్ చేయాల్సిందే. శాన్ డియాగో కామిక్ కాన్ వేడుకలో ప్రభాస్, దీపికా పదుకోనె, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, నాగ్ అశ్విన్ సందడి చేయనున్నారు.