బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన సొంత అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ చనిపోయి ఏడేళ్లు గడిచినప్పటికి అతని సూసైడ్ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. సుశాంత్ సూసైడ్ ఎవరో కావాలనే తనను హత్య చేశారని ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు ఆయన అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సుశాంత్ సింగ్ జీవిత కథ ఆధారంగా ‘న్యాయవాది: ది జస్టిస్’ అనే చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. దీంతో సుశాంత్ కుటుంబసభ్యులు ఈ సినిమాను ప్రదర్శించడం ఆపాలని హైకోర్టును కోర్టులో పిటిషన్ వేసింది. అయితే కోర్టులో సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్‌కు చేదుఅనుభవం ఎదురైంది. సినిమాను నిలిపివేయడానికి హైకోర్టు అంగీకరించలేదు.
ఇదిలా ఉండగా తాజాగా సుశాంత్ తండ్రి ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ సినిమా తీసి నిర్మాతలకు మరికొంతమందికి నోటీసులను పంపించింది. "నా కొడుకు జీవితంపై సినిమాలు తీస్తున్నారు. అన్యాయంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. మా నుంచి ఎలాంటి అనుమతి లేకుండా సుశాంత్ జీవితంపై సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీస్తున్నారు. పుస్తకాలు రాస్తున్నారు"అని సుశాంత్ తండ్రి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలా ఫిల్మ్ మేకర్స్ వ్యవహరించడం వల్ల సుశాంత్ పరువు, తన ప్రైవసీ, హక్కులకు విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు.