మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త మూవీ గాండీవధారి అర్జున. ప్రవీన్ సత్తారు డైరెక్షన్లో స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైనా టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అగస్ట్ 25న ఈ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో వరుణ్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నారు.
ఈ మూవీలో ఏజెంట్ సినిమాతో డెబ్యూ చేసిన సాక్షి వైద్య హీరోయిన్ నటిస్తోంది. ఇక ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా వరుణ్ తేజ్కు ఇప్పుడు హిట్ చాలా అవసరం. చాలారోజులుగా వరుణ్ ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. ఈ మధ్య రిలీజ్ అయిన అతని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఈ టైంలో వస్తున్న గాండీవధారి అర్జునపై వరుణ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ మూవీ కొడుతుందా అన్నది మరో 15రోజుల్లో తేలనుంది.