ఉన్నదాన్ని చెడగొట్టకు అంటున్న ‘ఫ్యామిలీ స్టార్’.. ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురాం కాంబోలో అప్పట్లో గీతగోవిందం మూవీ వచ్చింది. మళ్లీ ఆ కాంబోలోనే ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ వస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ సరసన ఇందులో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే గ్లింప్స్, టీజర్ వచ్చాయి. వాటి వల్ల మంచి బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా మేకర్స్ ఫ్యామిలీ స్టార్ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుందే ఇదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా అనిపిస్తోంది.
మిడిల్ క్లాస్‌కు చెందిన హీరో తన ఫ్యామిలీ బాధ్యతలు చూసేవాడు, ప్రేమించిన అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేస్తాడనే కాన్సెప్ట్‌తో కథ ముందుకు సాగుతుంది. ట్రైలర్‌లో కొద్దిగా యాక్షన్ పార్ట్‌ను కూడా చూపించారు. గోపిసుందర్ మ్యూజిక్ పీస్‌ఫుల్‌గా అనిపిస్తోంది. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రానుంది. లైఫ్‌లో బ్రేక్‌లేమీ ఇవ్వాల్సిన పనిలేదు..ఉన్నదాన్ని చెడగొట్టకు అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. నర్సును పెడదామనుకున్నాను..నమ్మకం కుదరలేదు..ఇందిదానికి చెపదామనుకుంటే వయసు సహకరించట్లేదు.. భార్య అయితే బాధ్యతగా చూసుకుంటుంది కదప్పా..అని చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది.
ఇక ట్రైలర్ చివర్లో విజయ్‌ను మృణాల్ లాగిపెట్టి కొట్టే సీన్, ఆ తర్వాత చాలా ప్రశాంతంగా ఉందిరా బాబు అంటూ విజయ్ డైలాగ్‌తో ట్రైలర్‌ను ముగించారు. ఓవరాల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటుగా యూత్‌ను ఈ మూవీ బాగా అట్రాక్ట్ చేయనుంది. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయిన ఈ మూవీ, ఇక ఇప్పుడు ట్రైలర్‌తో హైప్ క్రియేట్ చేసిందని చెప్పాలి. మరో వారం రోజుల్లో ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.