Viswak Sen: విశ్వక్ సేన్ కు షాక్ ఇచ్చిన సితార బ్యానర్

By :  Babu Rao
Update: 2023-10-30 08:45 GMT

బ్యాక్ గ్రౌండ్ లేదని తొక్కేస్తున్నారు. ఓర్చుకున్నా కొద్దీ మింగుతున్నారు. నేను సినిమా చూడకుండానే ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టిన కారణంగా చెబుతున్నాను. డిసెంబర్ 8నే వస్తున్నాము. ఆ రోజు విడుదల కాకపోతే నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ కే రాను..’ అంటూ భీకర ప్రతిజ్ఞ చేశాడు హీరో విశ్వక్ సేన్. కానీ రిలీజ్ అనేది హీరోల పని కాదు అనే విషయం అతనికి తెలియంది కాదు. అయినా ఆవేశ పడ్డాడు. కట్ చేస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అతను చెప్పిన డేట్ కు రావడం లేదు. మరి ఇతను ప్రమోషన్స్ ను మానేస్తాడా..?

ఆవేశం ఎప్పుడూ అనర్థాలే తెస్తుంది. ఇండస్ట్రీలో ముఖ్యంగా కంట్రోల్ చేసుకోవాల్సిందే ఇది. బట్ కొందరు మాత్రం ఆవేశంవస్తే ఆపుకోలేరు. అలాంటి వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకడు. అసలే బ్యాక్ గ్రౌండ్ లేని వారికి కష్టంగా ఉన్న ఇండస్ట్రీలో అప్పుడప్పుడూ కాస్త తగ్గి ఉండటము.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. ప్రొడక్షన్ హౌస్ నిర్ణయాలను కట్టుబడి ఉండటమూ చేయాలి. అందుకు భిన్నంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ని చెప్పిన టైమ్ కు రిలీజ్ కాకుండా కొందరు ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఈ ఆదివారం విశ్వక్ సేన్ చేసిన ఒక పోస్ట్ కాసేపే అయినా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైగా డిసెంబర్ 8న రాకపోతే తను ప్రమోషన్స్ కే రాను అంటూ భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. బట్ ఇప్పుడు ఆ సినిమా నిజంగానే వాయిదా పడింది. డిసెంబర్ 29కి పోస్ట్ పోన్ అయింది. మరి విశ్వక్ సేన్.. ఇప్పుడేం చేస్తాడు. చెప్పినట్టుగానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ కు దూరంగా ఉంటాడా..? ఉంటే అతనికి ఇండస్ట్రీలో క్రెడిబిలిటీ ఉంటుందా..? అంటే ఖచ్చితంగా ఉండదు. అయినా రిలీజ్ డేట్ అనేది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కలిసి తీసుకునే నిర్ణయం. ఒక్కోసారి కాస్త అటూ ఇటూ అవుతుంది. హీరోలను బట్టి ఈ విషయాల్లో నిర్ణయాలు ఉండవు. పైగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిర్మించింది ఏ అప్ కమింగ్ ప్రొడ్యూసరో కాదు. సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి ప్రామినెంట్ ప్రొడక్షన్ హౌస్. అటు డిస్ట్రిబ్యూషన్ లోనూ వారికి పట్టు ఉంది. అందుకే తమతో పాటు మరికొన్ని సినిమాలు వస్తున్నప్పుడు వాళ్లూ కాస్త పట్టు విడుపుగా ఉంటారు. ఇలాంటి విషయాల్లో హీరోలు అనవసరంగా ఆవేశపడితే ఆయాసం తప్ప ఇంకేం రాదు అనేది నిజం. సరే విశ్వక్ సేన్ వాదనలోనూ కొన్ని నిజాలు ఉన్నాయి. ఇక్కడ నిజాలు, అబద్ధాలు కంటే కూడా పరియాలు, సంబంధాలే ఇంపార్టెంట్. సో.. ఇప్పుడు తన భీష్మ ప్రతిజ్ఞకు కట్టుబడి విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ కు దూరంగా ఉంటాడా లేక.. బండ్ల గణేష్ ఆవేశంలో వంద అంటాం సార్ అని తప్పించుకుంటాడా అనేది చూడాలి.

Tags:    

Similar News