లేడీ గెటప్‌లో 'లైలా'గా వస్తున్న మాస్ కా దాస్..మరో టైటిల్ అనౌన్స్

Byline :  Shabarish
Update: 2024-03-29 11:30 GMT

టాలీవుడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బర్త్ డే సందర్భంగా మరో మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చేస్తున్న విశ్వక్ ఈ మూవీ తర్వాత 'మెకానికల్ రాకీ' అనే మూవీ చేయనున్నాడు. తాజాగా మరో మూవీ టైటిల్‌ను కూడా విశ్వక్ రివీల్ చేశాడు. VS12 మూవీని షైన్ స్క్రీన్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ టైటిల్‌ను 'లైలా' అంటూ మేకర్స్ ప్రకటించారు. సినిమాలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపిస్తారట.

మాస్ అప్పియరెన్స్‌తో కమర్షియల్‌‌గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విశ్వక్ లైలాతో మరో ప్రయోగం చేస్తున్నాడు. గామి, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ముఖచిత్రం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌లో నటించిన విశ్వక్ ఇప్పుడు మరో సరికొత్త కథతో తెలుగు ఆడియన్స్ ముందుకు రానున్నాడు. లైలా అనే లేడీ క్యారెక్టర్ చేయడంపై విశ్వక్ ఫ్యాన్స్ కూడా థ్రిల్‌గా ఫీల్ అవుతున్నారు. ఈ మూవీని దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్నారు.

ఆకాంక్ష శర్మ ఇందులో విశ్వక్ సరసన కనిపించనుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. గతంలో లేడీ గెటప్‌లో రాజేంద్ర ప్రసాద్, కమల్ హాసన్, చిరంజీవి, నరేష్, అల్లు అర్జున్, మనోజ్ వంటి స్టార్స్ కనిపించారు. ఇక ఇప్పుడు లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ ఎంత వరకూ అలరిస్తాడో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే మరి.

Full View

Tags:    

Similar News