రష్మిక చేతుల మీదుగా ‘స్లమ్‌డాగ్ హస్బెండ్’ పాట విడుదల

Update: 2023-07-11 15:53 GMT

విభిన్న కథాచిత్రాలను ఆదర్శిస్తున్న తెలుగు ప్రేక్షకుల కోసం మైక్ మూవీస్ మరో ట్రెండీ చిత్రాన్ని అందించనుంది. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ హీరోహీరోయిన్లుగా రూపొందిన ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ చిత్రాన్ని నెల 21న విడుదల చేయనుంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీలోని ‘‘యూ ఆర్ మై డీపీ, యూ ఆర్ మై బీపీ, నీ నవ్వే నాకు ఋణ మాఫీ...’ పాటను ప్రముఖ నటి రష్మిక మందన్న మంగళవారం విడుదల చేశారు. ‘‘భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ పాటను అదిందస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఆమె ట్వీట్ చేశారు.

సురేష్ గంగుల రాసిన ఈ పాటను సాయి మాధవ్, స్వాతి రెడ్డి పాడగా, సంజయ్, ప్రణవి రొమాంటిక్ డ్యాన్సుతో ప్రాణం పోశారు. పూరి జగన్నాథ్ శిష్యుడూ డాక్టర్ ఏఆర్ శ్రీధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని అన్నపరెడ్డి అప్పిరెడ్డి, వెంకట్ రెడ్డి నిర్మించారు. బ్రహ్మాజీ, సప్తగిరి, అలీ, ఛమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఇప్పటికే రిలీజైన ‘స్టమ్‌డాగ్ హస్బెండ్’ ట్రైలర్, ఇతర ప్రచార కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోంది. జాతక దోషం పోవాలని కుక్కను పెళ్లాడి, తర్వాత ప్రియురాలని పెళ్లిచేసుకోడానికి ఓ యువకుడు పడే తిప్పలను, కుక్కకు విడాకుల కేసు విచారణతో సరదా సాగే ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వింస్తుంది.

Full View


Tags:    

Similar News