Regina : పెళ్లికి రెడీ అయిన రెజీనా...వరుడు ఎవరో తెలుసా!

Byline :  Vinitha
Update: 2024-03-03 07:08 GMT

రెజీనా..ఎస్ఎమ్ఎస్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఎంట్రీ మూవీలోనే తన అందం, నటనతో కుర్రకారును ఆకట్టుకుంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ...రెజీనా నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత తెలుగులో మంచి ఆఫర్స్ కొట్టేసింది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో చేసిన పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీలతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. దీంతో తెలుగులో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.




 


అయితే కొంతకాలంగా పెద్దగా సినిమా అవకాశాలు దక్కించుకొని రెజీనా.. మెగాస్టార్ హీరోగా నటించిన ఆచార్యలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. కానీ, ఈ సినిమా కూడా చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ మధ్య సాయి తేజ, రెజీనా ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు అన్న వార్తలు వినిపించాయి. కానీ ఇద్దరు అలాంటిదేం లేదని మంచి స్నేహితులని చెప్పారు. కాగా ఇప్పుడు రెజీనా త్వరలో పెళ్లిపీటలు ఎక్కుతున్నట్లు తెలుస్తోంది. ఓ బిజినెస్‌మేన్‌ను ఆమె పెండ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇరు కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయని సమాచారం. అయితే త్వరలో ఈ శుభవార్తను రెజీనా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.




 




Tags:    

Similar News