మిల్కీ బ్యూటీ తమన్నా మంచి జోష్ లో ఉంది. ఆమె చేసిన వెబ్ సీరీస్ లు రెండూ హాట్ టాపిక్ అయ్యాయి. దాంతో పాటూ జైలర్ లో కావాలయ్యా పాట మరీ పాపులర్ అయింది. అయిపోయింది కెరీర్ అనుకుంటున్న సమయంలో సడెన్ గా ఇలా తమన్నా ఒక్కసారే మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం తమన్నావి భోళా శంకర్, జైలర్ పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పుడు తమన్నా చెప్పిన ఒక విషయం వైరల్ అవుతోంది. ఓర్నీ అదా సంగతి...భలే మోసం చేశారే అని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. అసలు విషయం ఏంటంటే...ఆమధ్య రామ్ చరణ్ వైఫ్ ఉపాసన తనకు డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చిందంటూ తమన్నా ఒక ఫోటో పెట్టింది. ప్రపంచంలోనే ఇదే పెద్ద డైమండ్ అని కూడా చెప్పింది. ఇప్పుడు అది నిజం కాదంటూ చావు కబురు చల్లగా చెబుతోంది. అది అసలు డైమండ్ రింగే కాదంట....వైన్ బాటిల్ ఓపెనర్ట. దాన్ని పట్టుకుని సరదాగా ఫోటో షూట్ చేశామని చెబుతోంది.
తమన్నా చెప్పిన ఈ నిజానికి అందరూ అవాక్కవుతున్నారు. సరదాగా చేసిన పని గురించి అందరూ ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు. అదో ఖరీదైన వజ్రం అని, ఖరీదు రెండు కోట్లు ఉంటుందని ఇలా....అవన్నీ తాను చదివానని...అందుకే ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాని చెప్పింది తమన్నా.