హీరోయిన్ త్రిషపై చీప్ కామెంట్స్..ఆ నేతపై ఫైర్

By :  Shabarish
Update: 2024-02-20 14:44 GMT

స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ ఇండస్ట్రీలో త్రిషపై ఇప్పటి వరకూ ఎన్నో ఇబ్బందికర వార్తలు వైరల్ అయ్యాయి. ఈమధ్యకాలంలోనే ఆమెపై పలువురు చీప్ కామెంట్స్ కూడా చేశారు. అలా కామెంట్స్ చేసిన వారిపై త్రిష అభిమానులు, సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లియో మూవీ సమయంలో నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానిపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోలర్స్‌ను తట్టుకోలేక, త్రిష అభిమానుల పోస్టులను భరించలేక మన్సూర్ క్షమాపణలు కూడా చెప్పాడు. న్యాయస్థానం కూడా మన్సూర్‌ను గట్టిగా మందలించింది.

తాజాగా తమిళనాడు అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఓ లీడర్ త్రిషపై చీప్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. డబ్బులిచ్చి త్రిషను రిసార్టుకు పిలిపించుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన వ్యాఖ్యలకు త్రిష అభిమానులతో పాటుగా నెటిజన్లు సైతం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఆ లీడర్‌ కామెంట్స్‌కు త్రిష సైతం స్పందిస్తూ ట్వీట్ చేసింది.

ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి కొందరు ఎంత స్థాయికైనా దిగజారిపోతారని, అలాంటి నీచమైన మనుషులను పదే పడే చూడటం వల్ల తనకు ఎంతో అసహ్యంగా ఉందన్నారు. ఆ లీడర్ చేసిన వ్యాఖ్యలకు అవసరమైన ఆధారాలతో కఠిన చర్యలు తీసుకునే వరకూ వదిలిపెట్టనని అన్నారు. న్యాయ విభాగ పరిధిలో తాను గట్టిగానే పోరాడుతానని త్రిష తన ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ ఘటనపై త్రిష సోషల్ మీడియాలో వార్నింగ్ ఇవ్వడంతో ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్ అవుతోంది. అందరూ త్రిషకు మద్దతుగా నిలుస్తున్నారు. అన్నాడీఎంకే నేతకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.


Tags:    

Similar News