నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హాయ్ నాన్న. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. బేబీ కియారా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. డిసెంబర్ 7న విడుదల కాబోతోన్న ఈ చిత్రంతో శౌర్యు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇంతకు ముందు విడుదలైన పాటలు, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ గా హాయ్ నాన్న ట్రైలర్ విడుదల చేశారు.
ఈ మూవీ టైటిల్ నుంచి టీజర్ వరకూ చూసిన ప్రతి ఒక్కరికీ అనేక సందేహాలున్నాయి. వాటిని క్లియర్ చేస్తున్నట్టుగానే ఉందీ ట్రైలర్. నానికి కూతురు ఉంది. ఆమె తల్లి ఎవరు అనేదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం థియేటర్స్ లోనే చెబుతారు అనుకున్నారు. బట్.. ట్రైలర్ లోనే చెప్పారు. ట్రైలర్ చూస్తే.. ఓ సింగిల్ ఫాదర్.. పేరు విరాజ్. తన కూతురుకు తల్లి గుర్తుకు రాకుండా ఉండేందుకు అనేక కథలు చెబుతుంటాడు. అన్ని కథల్లోనూ ఆమె తల్లి గురించిన ప్రస్తావన ఉండదు. ఈ క్రమంలో ఓ కథ చెబుతున్నప్పుడు యష్ణ ఆమె తల్లి పాత్రలో తనను ఊహించకోమంటుంది. ఆ తర్వాత యష్ణ వీరి జీవితంలోకి వస్తుంది. అలాగే నాని కూతురు తల్లిగా శృతి హాసన్ వర్ష అనే పాత్ర చేసినట్టు ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. వర్ష అతన్నుంచి ఎందుకు విడిపోయింది. కూతురును కూడా ఎలా వదిలేసింది అనేది సినిమాలో ఉంటుంది. అయితే వర్ష తర్వాత విరాజ్ లైఫ్ లోకి వచ్చిన యష్ణతోనూ అతను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు. ఈ ఇద్దరినీ ప్రేమించిన విరాజ్ తో పాటు అతని కూతురు జీవితంలో జరిగిన మార్పులు, సంఘటనలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మొత్తంగా ట్రైలర్ చూస్తే పూర్తిగా నాని ఇమేజ్ చుట్టూ అల్లుకున్న కథలా కనిపిస్తోంది. ఈ తరహా పాత్ర నాని ఇంతకు ముందు చేయలేదు. కానీ ఇలాంటి కథలు మాత్రం వచ్చాయి. వాటికీ దీనికీ ఎంత వ్యత్యాసం ఉంటుందనేది సినిమా చూస్తే కానీ తెలియదు. బట్ ట్రైలర్ లో మాత్రం అద్భుతం అని, ఖచ్చితంగా చూడాల్సిందే అనిపించేలాంటి మూమెంట్స్ అయితే ఏం లేవు. జస్ట్ నాని ఇమేజ్ కు తగ్గట్టుగా మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మాత్రం అనిపిస్తోంది తప్ప.. సినిమాకు ఒక్కసారిగా బజ్, క్రేజ్ ను పెంచేలా అయితే ఈ ట్రైలర్ లేదు అనే చెప్పాలి.