Raghavendra Rao : డైరెక్టర్ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు

Byline :  Bharath
Update: 2023-11-10 05:39 GMT

దర్శకుడు కె.రాఘవేంద్రరావు, కె.కృష్ణమోహన్‌ తదితరులకు హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్స్‌ షేక్‌పేటలో రెండెకరాల భూకేటాయింపుపై నోటీసులు ఇచ్చింది. ఇండస్ట్రీకి కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆయన, ఆయన కుటుంభం సొంతానికి వాడుకున్నారంటూ ఆరోపిస్తూ.. 2012లో పిల్ దాఖలయింది. కాగా, ఈ పిటిషన్‌పై కోర్టు గతంలో ఓసారి నోటీసులు జారీ చేసింది.. అయితే అవి వారికి అందినట్లుగా రికార్డుల్లో లేకపోవడంతో గురువారం (నవంబర్ 9) మళ్లీ నోటీసులు ఇచ్చింది. అనంతరం విచారణను జనవరి 18కి వాయిదా వేసింది.

మెదక్‌కు చెందిన బాలకిషన్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేశారు. అందులో.. రాయితీ ధరతో కేటాయించిన భూమిని రాఘవేంద్రరావు షరతులకు విరుద్ధంగా బార్‌లు, పబ్‌లు, థియేటర్లు తదితర వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.




Tags:    

Similar News