ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు..కాదు..కాదు..అర్థరాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి లైఫ్‌లో స్పేస్‌ను మొబైల్ ఫోన్స్ ఆక్రమిస్తున్నాయి. మానవ సంబంధాలను పక్కన పెట్టి ఈ మెటల్ వస్తువుకు ప్రజలు ఇస్తున్న ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఫోన్ లేకపోతే క్షణం కూడా గడవదు అన్నట్లుగా నిత్యం వాటికే గంటలతరబడి అతుక్కుపోతున్నారు. చిన్నా పెద్దా అన్న తేడా లేదు ఈ మొబైల్ ఫోన్స్‌కు అందరూ బానిసలవుతున్నారు. సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. అందరిలాగే తాను ఎక్కువగా ఫోన్కిఎడిక్ట్ అయ్యానని తలనొప్పిగా అనిపించినప్పుడల్లా మొబైల్ వాడకాన్ని తగ్గించడానికి తెగ ప్రయత్నిస్తుంటానని సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తాజాగా తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్లో మహేష్ మీడియాతో ఈ విషయాలను పంచుకున్నారు.
నాలెడ్జ్ సిటీలోని హోటల్లో ఓ కార్యక్రమంలో మీడియాతో మహేష్ మాట్లాడుతూ..."మీలాగే నేనూ ఫోన్ ఎక్కువగా వినియోగిస్తాను. అప్పుడప్పుడు హెడ్ ఏక్ వచ్చినప్పుడు ఫోన్ వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాను. రాత్రి పడుకునేటప్పుడు, ఉదయం లేవగానే ముందుగా మొబైల్ చూడడం నాకూ మీలాగే ఆ అలవాటు ఉంది. ఈవినింగ్ 6.30గంటలు దాటిన తరువాత మాగ్జిమమ్ దానికి దూరంగా ఉండేందుకు ట్రై చేస్తాను. వీలైనంత వరకు నా గాడ్జెట్స్ మా ఆవిడ నమ్రతనే తీసుకొస్తుంది. ఇక గౌతం పుట్టినప్పటి నుంచి సేవా కార్యక్రమాలను చేస్తున్నాము. సితార ఓ జ్యువెల్లరీ షోరూంకు బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపించడం చాలా సంతోషంగా ఉంది. నా రీరిలీజ్ సినిమాలపై వచ్చే కలెక్షన్ మొత్తాన్ని చిన్నారుల సంక్షేమానికి ఎంవీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థకు ఇస్తున్నాము. షూటింగ్స్ లేనప్పుడు ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తాను. కుటుంబంతో కలిసి టూర్స్‌కు వెళ్తుంటాను. నాకు మా పిల్లలతో టైం స్పెండ్ చేయడమంటే చాలా ఇష్టం.
సెలబ్రిటీలకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. దానిని గుర్తిస్తే బాగుంటుంది"అని మహేష్ తెలిపారు.