ప్రముఖ నటి సమంత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటోంది. తన వైవాహిక జీవితం గురించి పరోక్షంగా కామెంట్స్ చేశారు. తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏమిటి? అనేది చెప్పారు. తాజాగా తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చింది. తన వైవాహిక లైఫ్ గురించి ఆమె మాట్లాడుతూ.. తన ఇష్టాయిష్టాలను గుర్తించడంలో విఫలమయ్యానని సమంత తెలిపింది. తన జీవితంలో తాను చేసిన పెద్ద తప్పు ఇదేనని చెప్పింది. ఈ విషయాన్ని తాను చాలా ఆలస్యంగా తెలుసుకున్నానని.. ఎందుకంటే తన గత జీవిత భాగస్వామి తన ఇష్టాయిష్టాలను ప్రభావితం చేశాడని చెప్పింది. కష్టాల్లో ఉన్నప్పుడే మనం విలువైన పాఠాలను నేర్చుకోగలమని తెలిపింది.
మరోవైపు గతంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. వరుస ఫ్లాప్ లు, ఆరోగ్య సమస్యలు, విడాకులు ఒకేసారి చుట్టుముట్టడంతో కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఓవైపు ఆరోగ్యం దెబ్బతింటుంటే.. మరోవైపు వైవాహిక బంధం ముగిసిపోయిందని తెలిపింది.మయోసైటిస్ తో బాధపడుతుండటంతో దానికి చికిత్స తీసుకోవడం కోసం సమయాన్ని హెల్త్‌కి కేటాయించి పెట్టారు. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. మరోవైపు కొద్దిరోజుల క్రితమే నిర్మాతగా మారి ఒక సంస్థను ప్రారంభించారు. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి ప్రతిభావంతులైన కొత్త దర్శకులు, నటీనటులను ప్రోత్సహించనున్నారు. తన నిర్మాణ సంస్థద్వారా ఎంతోమంది ప్రతిభ కలిగినవారు వెలుగులోకి రావాలనేది సమంత కోరిక.