రామ్ చరణ్ తో కలిసి ఏదో ఒకరోజు సినిమా చేస్తా- ప్రభాస్

Update: 2023-07-21 10:15 GMT

ప్రాజెక్ట్ కె గ్లింప్స్ వచ్చేశాయి...పేరు కూడా తెలిసిపోయింది. ప్రభాస్ ఫస్ట్ లుక్ తో డీలా పడిపోయిన ఫ్యాన్స్ గ్లింప్స్ చూసి మాత్రం పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం గ్లింప్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి.శాన్ డియాగో కామిక్ కాన్ కు హాజరైన కల్కి 2898ఎడి మూడీ నటులు ప్రభాస్, కమల్ హసన్, రానాలు మీడియాతో కాసేపు మాట్లాడారు. అందులో బాహుబలి, ఆదిపురుష్, సాహో, సాలార్, కల్కి 2898 AD వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు కదా ఇందులో రియల్ సెట్స్ కంటే బ్లూ స్క్రీన్ సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి...మరి మీకు బోర్ కొట్టడం లేదా అంటూ ఓ విలేఖరి ప్రభాస్ ని ప్రశ్నించారు. దానికి ప్రభాస్ సరదాగా సమాధానం చెప్పాడు. మొదట్లో షూటింగ్ సమమయంలో బోర్ కొట్టిందని... ఆ బ్లూ స్క్రీన్ ముందు తాను చిన్నగా కనిపిస్తున్నానని చెప్పాడు. కానీ గ్లింప్స్ చూశాక మాత్రం చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చాడు.

అలాగే రాజమౌళి రామ్ చరణ్ ల గురించి కూడా ప్రభాస్ మాట్లాడాడు. భారత్ లో ఉన్న అద్బఉతమైన దర్శకుల్లో రాజమౌళి ఒకరని....ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడం గర్వంగా ఉందని అన్నాడు. రాజమౌళి అవార్డుకు అన్ని విధాలా అర్హుడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. రామ్ చరణ్ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పాడు ప్రభాస్. అన్నీ కలిసి వస్తే ఏదో ఒక రోజు తామిద్దరం కలిసి సినిమా చేస్తామని అన్నాడు. ప్రభాస్ మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఎన్టీయార్, చరణ్ కాంబో అదిరిపోయింది. అలాగే ప్రభాస్ రామ్ చరణ్ కాంబినేషన్ లో మూవీ వస్తే ఫ్యాన్స్ కు పండగేనని అంటున్నారు.


Tags:    

Similar News