చచ్చినా వెంకటేష్‌తో సినిమా చేయను..స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా నటించిన ప్రతి సినిమాతో మంచి కలెక్షన్స్ రాబట్టిన హీరోల్లో వెంకటేష్ ముందు వరుసలో ఉంటారు. ఎమోషనల్ సన్నివేశాలతో ప్రేక్షకుల హృదయాలను ఎలా గెలవాలో వెంకీకి బాగా తెలుసు. వెంకటేష్ కెరీర్లో ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. అందుకే వెంకటేష్‌తో సినిమా చేయాలంటే దర్శక నిర్మాతలు ముందుంటారు. కానీ స్టార్ డైరెక్టర్ తేజ మాత్రం వెంకీతో సినిమా అంటే ససేమిరా అని అంటున్నారు. వెంకటేష్‌తో చచ్చినా సినిమా చెయ్యననంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.
అప్పట్లో తేజ వెంకటేష్‌తో సావిత్రి అనే సినిమా చేయాలనుకున్నారు. వెంకటేష్‌కు కథ కూడా చెప్పారట. ‘‘ కథ విన్న వెంకీ కొన్ని మార్పులు చేసుకుని రమ్మన్నాడు. నేను కథ మార్చే సమయంలోనే వెంకటేష్ మరో దర్శకుడితో సినిమా ప్రకటించేశాడు. దీంతో నాకు వెంకటేష్‌పై చాలా కోపం వచ్చింది. ఇకపై ఆయనతో సినిమా తీయకూడదని డిసైడ్ అయ్యాను. ఒకవేళ ఆ హీరోతో సినిమా చేయాల్సి వస్తే ‘సావిత్రి’ కథనే చేస్తాను’’అని డైరెక్టర్ తేజ చెప్పుకొచ్చారు. మరి ఈ విషయం తెలుసుకుని వెంకటేష్ డైరెక్టర్ తేజాకు అవకాశం ఇస్తాడో లేదో అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే.