మంచు విష్ణుకు అల్లు అర్జున్ థాంక్స్..ఎందుకంటే..?

By :  Aruna
Update: 2023-09-09 15:34 GMT

టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‎కు ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును ప్రకటించింది. టాలీవుడ్ నుంచి బెస్ట్ యాక్టర్‎ పురస్కారాన్ని అందుకోబోతున్న మొదటి హీరోగా బన్నీ హిస్టరీని సృష్టించాడు.దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, స్టార్స్ ,నిర్మాతలు, దర్శకులు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ బన్నీకి అభినందనలు తెలిపారు.

పుష్ప సినిమాలోని పుష్పరాజ్ క్యారెక్టర్‎తో అప్పటి వరకు స్టైలిష్ స్టార్‎గా ఉన్న బన్నీ కాస్తా ఐకానిక్ స్టార్‎గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో బన్నీ ఇచ్చిన పవర్‎ఫుల్ పెర్ఫార్మెన్స్‎కే బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నాడు.

తాజాగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా బన్నీకి అభినందనలు తెలిపారు. ఓ లేఖను మా అసోసియేషన్ తరఫున విడుదల చేసి అల్లు అర్జున్‎ను ప్రశంసలతో ముంచేశాడు. తాజాగా ఈ లేఖపై బన్నీ కూడా స్పందించాడు. "మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ మంచు విష్ణు గారికి ధన్యవాదాలు. ఈ అందమైన ఉత్తరానికి థ్యాంక్స్. ఈ ప్రశంసలను నన్ను ఎంతగానో టచ్ చేశాయి. నా హృదయానికి హత్తుకున్నాయి. త్వరలోనే మీతో వ్యక్తిగతంగా టచ్‎లోకి వస్తాను" అని బన్నీ తెలిపాడు.


Tags:    

Similar News