Robert Downey jr : ఫైనల్గా ‘‘ఐరన్ మ్యాన్’’కు మొట్టమొదటి ఆస్కార్

Byline :  Bharath
Update: 2024-03-11 04:38 GMT

మార్వెల్ సినిమాలు చూసేవారెవరికైనా రాబర్డ్ డౌనీ జూనియర్ (ఐరన్ మ్యాన్) సుపరిచితమే. రాబర్డ్ డౌనీ జూనియర్ కన్నా.. ఐరన్ మ్యాన్, టోనీ స్టార్క్ అంటేనే ప్రపంచం ఎక్కువ గుర్తుపడుతుంది. అవేంజర్స్ సీక్వెల్స్ అన్నిట్లో సూపర్ పర్ఫామెన్స్ చేసిన రాబర్ట్ కు ఇప్పటివరకు ఒక్క ఆస్కార్ అవార్డ్ కూడా రాలేదు. కలగానే మిగిలిపోయింది అనుకున్న అవార్డును తాజాగా రాబర్డ్ ముద్దాడాడు. ప్రపంచ సినీమా రంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక ప్రారంభమయింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా మొదలైంది. దేశ, విదేశాల నుంచి సినీ తారలు ఈ వేడుకకు హాజరయ్యారు. విభాగాల వారిగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. కాగా ఈసారి ఓపెన్ హైమర్ సినిమా సత్తాచాటింది.

ఓపెన్ హైమర్ లో రాబర్ట్ డౌనీ జూనియర్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. కాగా సినిమాలో రాబర్డ్ నటనపై ప్రశంసల వర్షం కురిసింది. ఇక అప్పటి నుంచి తన నటనకు ఆస్కార్ ఖచ్చితంగా వస్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అందని అంచనాలకు తగ్గట్లే రాబర్ట్ ఉత్తమ సహాయ నటుడి అవార్డ్ అందుకున్నాడు. అయితే రాబర్ట్ అందుకున్న తొలి ఆస్కార్ అవార్డ్ ఇదే కావడం విశేషం. దీంతో అతని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఫైనల్ గా తమ ‘ఐరన్ మ్యాన్’కు ఆస్కార్ అవార్డ్ వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాబర్డ్ సుధీర్ఘ కెరీర్ లో మూడు సార్లు ఆస్కార్ కు నామినేట్ అయ్యాడు. అయితే మొదటిసారి అవార్డును ముద్దాడాడు.

Tags:    

Similar News