అల్లు అర్జున్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓహో చిన్న మావయ్య పార్టీలోకే కదా అనేసుకుంటున్నారు కదా వెంటనే అబ్బే...కాదండీ...పిల్లనిచ్చిన మామ తరుఫున. భార్య స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఆయన తరుఫునే ప్రచారం చేస్తారని టాక్ వినిపిస్తోంది.
తెలుగు సినిమాల్లో అల్లు అర్జున్ ఒక స్టార్ హీరో. ఇతనికి చాలా ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. పుష్ప సినిమాతో మరో లెవల్ కి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్. దీన్నే వాడుకోవాలనుకుంటున్నారు అల్లు అర్జున్ మామ. చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలంగా కీలక వ్యక్తిగా ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని భావిస్తున్నారు. నాగార్జునా సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నిజంగా కనుక ఆయనకు టికెట్ వస్తే తప్పనిసరిగా ఎన్నికల ప్రచారం చేయాలి. అప్పుడు అల్లు అర్జున్ రంగంలోకి దిగుతాడు అని సమాచారం.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ఒకసారి అల్లు అర్జున్ ఇలా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే అప్పటికీ బాబు పెద్దగా ఫేమస్ కాలేదు కాబట్టి ఏమీ వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఎప్పుడూ పాలిటిక్స్ జోలికి పోలేదు. పవన్ కల్యాణ్కే మా మద్దతు అని అంటున్నా...ఇలా ప్రచారాల్లో పాల్గొనడం లాంటివి ఏమీ చేయలేదు. ఇప్పుడు పిల్లనిచ్చిన మామ కోసం మాత్రం కచ్చితంగా ప్రచారంలోకి దిగుతాడని అంటున్నారు. దీని గురించి అఫీషియల్ గా ఏమీ తెలియకపోయినా...చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం అదే జరిగితీరుతుందని చాలా గట్టిగా టాక్ వినిపస్తోంది.అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత బన్నీ బాలీవుడ్ లో ఒక మూవీ చేయనున్నారని ఫిల్మ్ వర్గాల భోగట్టా.