సినిమాలు, రాజకీయాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నవాళ్ళకి సినిమా వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం. అలాగే సినిమాల్లో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ కొట్టినవారు కూడా ఉన్నారు. ఇది తరతరాల నుంచి సాగుతున్న వ్యవహారమే. ఇప్పుడు యంగ్ హీరో నితిన్ కూడా ఈ బాటలోనే పయనిస్తున్నాడా అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి.
లాస్ట్ ఇయర్ బీజెపీ నేత జేపీ నడ్డా హీరో నితిన్ న్ కలిసిన విషయం తెలిసినదే. ఎన్నికలు దగ్గర పడడంతో స్టార్ హీరోలు తమ పార్టీకి ప్రచారం చేయాలని బీజెపీ భావిస్తోంది. అందులో భాగంగానే నితిన్ కూడా కలిసారని...అయితే నితిన్ మాత్రం దాన్ని సున్నితంగా తిరస్కరించారని వార్తలు వచ్చాయి. అయితే దాని వెనుక అసలు రీజన్ నితిన్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుండడమే అనే వార్త ఇప్పుడు వెలుగులోక వచ్చింది.
నితిన్ రాజకీయాల్లోకి వస్తాడనే విషయం కూడా నిజమే అంటున్నారు. అయితే ప్రస్తుతంత వరుస సినిమాలతో బిజీగా ఉన్న నితిన్ డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి మాత్రం రాడు అని చెబుతున్నారు. అతని మేనమా నగేష్ రెడ్డిని సపోర్ట్ చేయడం ద్వారా రాజకీయాల్లో ఉంటారని తెలుస్తోంది. నగేష్ చాలా ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉంటున్నారు. ఈ మధ్యనే ఆయన రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారుట. నితిన్ వాళ్ళ సొంత ఊరు నిజామాబాద్ రూరల్ నుంచి నగేష్ ను పోటీ చేయించాలని నితిన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సర్వేలను బట్టి టికెట్ ఇస్తానని రేవంత్ రెడ్డి నగేష్ కు చెప్పారని...అందుకే నితిన్ టికెట్ కోసం కష్టపడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం నితిన్ కానీ, అతని మేనమామ కానీ డైరెక్ట్ గా చెప్పలేదు. అసలు నిజం తెలియాలంటే టికెట్లు ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.