అతనో పెద్ద హీరో...డైరెక్టర్ కూడా. మలయాళంలో ఇతని సినిమాలకు క్రేజ్ ఉంది. అతనే పృథ్వీరాజ్ సుకుమారన్. మంచి అందగాడుగా పేరు తెచ్చుకున్న పృథ్వీ హీరోగానే కాదు తాను చేసే పాత్రకు ప్రాముఖ్యం ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తుంటాడు. ప్రస్తుతం ఇతనే మన ప్రభాస్ నటిస్తున్న సలార్ లో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఇది అయిపోయాక ప్రభాసే...పృథ్వీరాజ్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నాడుట.
సలార్ రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మూవీలో ప్రభాస్ కి ప్రతినాయకుడిగా మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోంది. మూవీ రెండు భాగాల్లోనే ఇతను ఉంటాడని తెలుస్తోంది. ఈ షూటింగ్ సమయంలోనే పృథ్వీరాజ్ ప్రభాస్ కు ఒక స్టోరీని చెప్పారుట. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ. ప్రభాస్ కి కూడా కథ చాలా బాగా నచ్చిందట. అయితే సినిమా చేస్తాడా లేదు అనేది ఇంకా కన్ఫామ్ చేయలేదు.
ప్రస్తుతం ప్రభాస్....సలార్, కల్కి సినిమాలతో బిజీగా ఉననాడు. దీని తర్వాత మారుతి దర్శకత్వంలో ఒక సినిమా, హను రాఘపూడి డైరక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు. వాటి తర్వాతే పృథ్వీరాజ్ సినిమా ఉండొచ్చు. ఇక పృథ్వీ మలయాళంలో డైరక్షన్ చేసిన లూసిఫర్, బ్రో డాడీ సినిమాలు రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండిటిలోనూ మోహన్ లాల్ నటించారు. అలాగే ఇప్పుడు మలయాళంలో ఒక పాన్ ఇండియా మూవీ చేసే ప్రయత్నంలో కూడా ఉన్నారు ఆయన. ప్రభాస్ వి లైన్లో మూవీస్, పృథ్వీరాజ్ మూవీ అయ్యాకనే వీళ్ళద్దరి కాంబినేషన్ లో మూవీ ఉంటుంది. దానికి కచ్చితంగా రెండేళ్ళు అయినా టైమ్ పడుతుంది. అందుకే ప్రభాస్ కూడా వెంటనే తన నిర్ణయాన్ని చెప్పలేదని అంటున్నారు.