లక్ష్మీ మీనన్...ఒకప్పుడు తమిళంలో పెద్ద హీరోయిన్. రీసెంట్ గా ఆమెకు సినిమాలు తగ్గిపోయాయి. వేదాళంలో అజిత్ కు చెల్లెలుగా నటించిన లక్ష్మి...చాలా రోజుల తర్వాత ఇప్పుడు చంద్రముఖి-2లో నటిస్తోంది. ఈ 27 ఏళ్ళ నటి త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా హీరో విశాలో తో అని సమాచారం.
లక్ష్మీ మీనన్, విశాల్ కలిసి పల్నాడు, ఇంద్రుడు అనే రెండు సినిమాలు చేశారు. అప్పట్లోనే వీరిద్దనూ ప్రేమించుకుంటున్నారని, పెళ్ళి చేసుకుంటారని వార్తలు వినిపించాయి. అయితే తర్వాత వీరిద్దరూ కలిసి ఏ సినిమా చేయకపోవడంతో కాస్త సద్దుమణిగాయి. ఇప్పుడు మళ్ళీ లక్ష్మీ పెళ్ళికూతురు కాబోతోంది అనే వార్త వచ్చేసరికి విశాల్ నే చేసుకుంటుందనే గాసిప్ కూడా గుప్పుమంది.
ఈ పెళ్ళి గురించి ఇరు వర్గాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అయితే వీళ్ళిద్దరూ చాలా కాలంా ప్రేమించుకుంటూ ఉన్నారని...బయటకు తెలియకుండా జాగ్రత్తపడుతున్నారని అంటున్నారు. ఇప్పుడు ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయ్యారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. విశాల్, లక్ష్మీ మీనన్ కలిసి చేసిన రెండు సినిమాల్లో వీరిద్దరికీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అప్పట్లో అనుకున్నారు.