TheGirlfriend : రష్మిక మందన్న ద గర్ల్ ఫ్రెండ్ ప్రారంభం
వరుస సినిమాలతో దూసుకుపోతోన్న నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్నా. రీసెంట్ గా రిలీజ్ అయిన యానిమల్ మూవీలో తన నటనకు అద్బుతమైన అప్లాజ్ వస్తోంది. ఏ మాత్రం గ్లామర్ షో లేకుండా తన పాత్రను నీట్ గా ప్రజెంట్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ అప్లాజ్ ను ఎంజాయ్ చేస్తూనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేసింది.ప్రస్తుతం తెలుగులో తను పుష్ప2 మూవీతో పాటు రెయిన్ బో అనే ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది. దీంతో పాటు రీసెంట్ గా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ద గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమాకు సైన్ చేసింది. ఈ చిత్రాన్ని బేబీ ఫేమ్ ఎస్కేఎన్ నిర్మిస్తుండటం విశేషం.
లేటెస్ట్ గా ద గర్ల్ ఫ్రెండ్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇండస్ట్రీలోని పలువురు పెద్దలు ఈ మూవీ ఓపెనింగ్ షాట్ కు హాజరయ్యారు. ఈ మేరకు ఫస్ట్ షాట్ ను సింగిల్ టేక్ లో ఓకే చేశాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. టైటిల్ చూస్తే ద గర్ల్ ఫ్రెండ్ అంటూ సాఫ్ట్ గానే ఉన్నా.. ఈ కథలో ఊహించని మలుపులు చాలానే ఉంటాయట. ఈ తరహా పాత్ర రష్మిక ఇప్పటి వరకూ చేయలేదు అని చెబుతున్నారు. ఈ కారణంగానే తను బటర్ ఫ్లై తర్వాత మరో లేడీ ఓరియంటెడ్ సినిమా అయినా ఒప్పేసుకుందంటున్నారు. మొత్తంగా అటు రెగ్యులర్ హీరోయిన్ గా ఇటు సోలోగా సినిమాలు ఒప్పుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతోందీ నేషనల్ క్రష్.