జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తిక్ పెళ్లీపీటలెక్కాడు. కెవ్వు కార్తిక్-శ్రీలేఖల వివాహం గురువారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ వేదికగా జరిగిన వీరి పెళ్లికి ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. గెటప్ శ్రీను సహా పలువురు కమెడియన్స్ కెవ్వు కార్తీక్ వివాహానికి హాజరై సందడి చేశారు. కెవ్వు కార్తీక్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షైర్ చేశాడు గెటప్ శ్రీను. కొత్త దంపతులు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు
గత కొద్ది రోజులు కిందట వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సోషల్ మీడియా వేదికగా కెవ్వు కార్తీక్ వెల్లడించాడు. మరోసారి కాబోయే భార్యను పరిచయం చేశాడు. గురువారం ఓ ఇంటివాడయ్యాడు.వరంగల్ కు చెందిన కెవ్వు కార్తీక్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం ఓ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అయితే సినిమాలపై మక్కువతో ఉద్యోగం వదిలేసి సినీపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. మొదట మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి టీం లీడర్‌గా ఎదిగాడు. తన టాలెంట్‌తో పలు చిత్రాల్లో కూడా నటించాడు. గతేడాది విడుదలైన ‘ముఖచిత్రం’, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రాల్లో కెవ్వు కార్తీక్ అలరించాడు.ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లిళ్ల హడావుడి నడుస్తోంది. ఇటీవల శర్వానంద్ - రక్షితా రెడ్డి జంట ఒక్కటయ్యారు. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థమంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా కెవ్వు కార్తీక్ ఓ ఇంటివాడయ్యాడు.