'జైలర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. రజినీ మేనియా షురూ..

Update: 2023-08-11 07:12 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) జైలర్(Jailer) మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. రిలీజైన మొదటి షో నుండే పాజిటీవ్ టాక్ రావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. సినిమాలో ఎప్పటిలాగే రజినీకాంత్ తన స్టైల్, లుక్స్ అండ్ డైలాగ్స్‌తో వావ్ అనిపించారు. దీనికి తోడు అలరించే థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాయి. ఇక ఈ సినిమా కలెక్షన్స్ (Jailer Collections) విషయానికి వస్తే.. పాజిటివ్ టాక్‌తో ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకుని వావ్ అనిపించింది. దాదాపుగా 7 ఏళ్ల తర్వాత రజినీ సినిమా బాక్స్ ఆఫీస్‌ను ఓ రేంజ్ లో షేక్ చేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక జైలర్ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాం: 3.21 కోట్లు, సీడెడ్: 94 లక్షలు, ఉత్తరాంధ్ర : 81 లక్షలు, తూర్పు: 40 లక్షలు, పశ్చిమ: 33 లక్షలు, గుంటూరు: 65 లక్షలు, కృష్ణ: 45లక్షలు, నెల్లూరు: 22లక్షలు, ఏపీ తెలంగాణ మొత్తంగా 7.01 కోట్ల షేర్ రాగా.. 12 కోట్ల గ్రాస్ వచ్చిందని అంటున్నాయి.




 


ప్రపంచవ్యాప్తంగా జైలర్ సినిమా మొదటిరోజు రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.43 కోట్ల రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం. అమెరికాలో సైతం ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది. అక్కడ జైలర్ సినిమా మొదటిరోజు ఏకంగా 1.450 మిలియన్ కలెక్షన్స్ రాబట్టిందట. అంతకుముందు విజయ్ బెస్ట్ సినిమాపై ఉన్న 1.375 రికార్డ్స్ ను జైలర్ క్రాస్ చేసింది. జైలర్ కు వస్తున్న భారీ రెస్పాన్స్ చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు లాంగ్ రన్ లో జైలర్ సినిమా రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలువనుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక రజనీకాంత్ ప్రస్తుతం జైలర్‌ తర్వాత మరో సినిమా కూడా చేస్తున్నారు అదే లాల్ సలాం.. ఈ సినిమాకు రజనీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తోంది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో సూపర్‌ స్టార్‌ రజనీ మోయిదీన్ అనే పాత్ర చేస్తున్నారు.




 



Tags:    

Similar News