Anirudh : అనిరుధ్‌కు కళ్లు చెదిరే బహుమతి ఇచ్చిన జైలర్ నిర్మాత..

Byline :  Aruna
Update: 2023-09-05 08:00 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా వచ్చిన జైలర్ సినిమా బాక్సాఫీసును ఓ రేంజ్‎లో షేక్ చేసేస్తోంది. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తన సినీ కెరీర్‎లో రజినీకాంత్ మరే చిత్రానికి రాని ఘన విజయాన్ని జైలర్ ద్వారా సాధించారు. టాలీవుడ్, కోలీవుడ్ ఈ రెండు ఇండస్ట్రీలోనూ దుమ్ముదులిపేశారు తలైవా. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా తన డ్యాన్స్ మూవ్స్‎తో యూత్‎కు పిచ్చెక్కించేసింది. ఇక సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చి తన బ్రాండ్ ఇమేజ్‎ను మరోసారి చూపించాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. ఈ చిత్రం సూపర్ హిట్ కావడానికి మ్యూజిక్ కూడా ప్రధాన కారణమని చెప్పక తప్పదు.




 


ఈ మధ్యనే సినిమా హిట్‎కు కారణమైన డైరెక్టర్ నెల్సన్‎కు ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు జైలర్ నిర్మాత కళానిధి మారన్. అంతే కాదు భారీ నెంబర్ ఉన్నఓ చెక్‏ను అందించారు. తాజాగా కళానిధి అనిరుధ్‎కు కళ్లు చెదిరే బహుమతి అందించారు. తన మ్యూజిక్‎తో మైమరపించిన అనిరుధ్‎కు ఓ చెక్‎తో పాటు కాస్ట్లీ కారును గిఫ్ట్‎గా ఇచ్చారు. దీంతో జైలర్ నిర్మాతది ఎంత గొప్ప మనసో అని నెటిజన్లు ఆయనను కామెంట్ల రూపంలో పొగిడేస్తున్నారు. జైలర్ సినిమా బాక్సాఫీస్‎లో భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో చిత్రానికి వచ్చిన లాభాల్లో ఇలా మూవీ టీమ్‎కు షేర్ చేసే నిర్మాతలు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.




 




 



Tags:    

Similar News