జైలర్‌కు దిమ్మతిరిగే పారితోషికం.. దేశ చరిత్రలోనే తొలిసారి!

Byline :  Lenin
Update: 2023-09-01 02:37 GMT

‘జైలర్’ రజనీకాంత్ కేక పుట్టిస్తున్నారు. కలెక్షన్లలో కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. నెల్సన్ దర్శకత్వంతో తెరకెక్కిన జైలర్ మూవీ బాక్సాఫీసులు బద్దలు కొడుతోంది. గత నెల 10న విడుదలైన ఈ చిత్రం తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా నిర్మాతకు డబ్బుల వరద పారిస్తోంది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లోనూ భారీ వసూళ్లు సాధిస్తోంది. వరల్డ్ వైడ్‌గా .650 కోట్లకు పైగా వసూలైంది. కొన్నాళ్లుగా మంచి హిట్ లేక సోసోగా నడిపిస్తున్న తళైవా జైలర్ సక్సెస్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ వేడుకల్లో మునిగి తేలుతున్నారు.




 


జైలర్ వసూళ్లు అంచనాకు మించడంతో ఆయన గురువారం రజనీకాంత్‌ను కలుసుకుని సత్కంరించారు. అదనపు పారితోషికం కింద చెక్కును కూడా అందజేశారు. రూ. 100 కోట్లకు చెక్ ఇచ్చినట్లు కోలీవుడ్ భోగట్టా. ఈ మూవీకి రజనీ ఇప్పటికే రూ. 110 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా పారితోషికం కూడా కలిపితే రూ. 210 కోట్లు అవుతుంది. అదే నిజైమైతే దేశ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్న హీరోగా రజనీ నిలిచిపోతారు. రజనీ మేనియాకు తమన్నా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్‌ల పర్ఫామెన్స్, అనిరుధ్ సంగీతం కూడా తోడు కావడంతో జైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కోలీవుడ్ తాజా హిట్ మూవీలైన కమల్ హాసన్ ‘విక్రమ్’, మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ల కలెక్షలను దాటిపోయిన జైలర్ నిర్మాణంలో రజనీ కూడా పెట్టుబడి పెట్టినట్టు టాక్!




 


Tags:    

Similar News