jawan movie : షారుఖ్ ఖాన్ 'జవాన్'కు ఫస్ట్ ఛాయిస్ నయనతార కాదట..
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం ‘జవాన్’ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 7న విడుదలవుతున్న ఈ సినిమా సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ రెండ్రోజుల క్రితం గ్రాండ్‍గా జరిగింది. చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ఈ ఈవెంట్‌లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తన లైవ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. షారూఖ్ ఖాన్ చేత.. బందా పాటకు స్టెప్‍లు వేయించారు. ఇందుకు సంబంధించిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ఈవెంట్‍కు రాలేదు. సహనటులు విజయ్ సేతుపతి , ప్రియమణి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు తదితరులు అందరూ వచ్చినా.. ఆమె హాజరుకాకపోవడం పలు చర్చలకు దారి తీసింది. నయనతారకు ఇదే ఫస్ట్ బాలీవుడ్ సినిమా. కచ్చితంగా ఈ ఆడియో లాంచ్ ఈవెంట్‌కి రావాల్సి ఉన్నా.. ఆమె రాకపోవడంతో.. ఎందుకు కనిపించలేదు అని చాలా మంది ఆరాలు తీశారు.
అయితే 'జవాన్'లో షారుఖ్ ఖాన్ సరసన నటించడానికి డైరెక్టర్ అట్లీ ఫస్ట్ ఛాయిస్ నయనతార కాదట. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' తో బాలీవుడ్ జనాలకు దగ్గరైన మరో సౌత్ బ్యూటీనే ఈ సినిమాకు హీరోయిన్‌గా చేయమని ఆఫర్ ఇస్తే ఆమె తిరస్కరించారట. ఆమె మరెవరో కాదు.. సమంత రుత్ ప్రభు. తన భర్త నాగచైతన్యతో మళ్లీ కలిసి ఉండాలనే ఈ ఆఫర్ ను వదులుకుందని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక వేరే ఆప్షన్ లేక నయనతార బెస్ట్ చాయిస్ అని అట్లీ భావించాడట. అయితే ఈ పుకార్లను సమంతా లేదా 'జవాన్' టీమ్ అధికారికంగా ధృవీకరించలేదు అలా అని ఖండించనూ లేదు. అయితే అభిమానులు మాత్రం షారుఖ్, సమంతలు కలసి కనీసం రాబోయే సినిమాల్లో అయినా నటించాలని కోరుకుంటున్నారు.