విజువల్ వండర్ గా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. తెలుగు రాష్ట్రాతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లన్నీ హౌజ్ ఫుల్ అయిపోయాయి. థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. కొందరు సినిమాపై మంచి రెస్పాన్స్ ఇస్తుంటే.. ఇంకొందరు రకరకాలుగా ట్రాల్ చేస్తున్నారు. ఆదిపురుష్ లోని కొన్ని సీన్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలోని అయోధ్య సీన్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
రాఘవ్ తండ్రి దశరథునితో మాట్లాడుతున్న సన్నివేశం అది. ఇందులో ప్రభాస్ కొంత్తగా కనిపించాడు. తెల్లబట్టలు కట్టుకుని, జట్టు వదిలేసి.. అచ్చం ఏసు ప్రభు సినిమాల్లో చూసిన జీసస్ లా కనిపించాడు. అది చూసిన కొందరు.. ‘ఆదిపురుష్ సినిమాలో జీసస్ ఏం చేస్తున్నాడు.’, ‘ఆదిపురుష్ అనుకుని వస్తే.. జీసస్ సినిమా వేస్తారేంటి’, ‘ఆదిపురుష్ లో సిమోను ఎలా వచ్చాడు’ అంటూ కామెంట్స్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఒక్కో గెటప్ ను పోస్ట్ చేస్తూ.. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.