గ్రాండ్ గా రిలీజ్ అయిన అతనే 'జితేందర్ రెడ్డి' మూవీ గ్లింప్స్

Update: 2024-04-03 13:40 GMT

ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచేసాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ వేడుక చాలా ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ : చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటి తెలుసుకోవాల్సిన ఒక చరిత్ర జితేందర్ రెడ్డి జీవితం. ఈ సినిమాలో ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన విరించి గారు జితేందర్ రెడ్డి గురించి తెలుసుకొని ఈ సినిమా నేను డైరెక్ట్ చేస్తానని ముందుకు రావడం చాలా ఆనందం అనిపించింది. అదేవిధంగా రాకేష్ ఈ సినిమాతో జితేందర్ రెడ్డిగా ఆ పాత్రలో జీవించారు. ఈ సినిమా తర్వాత జితేందర్ రెడ్డిగా గుర్తింపు తెచ్చుకుంటారు అంత అద్భుతంగా నటించారు. ఎన్నో అవార్డులు తీసుకున్న డిఓపి జ్ఞాన శేఖర్ గారు ఈ సినిమాకు పనిచేయడం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి జితేందర్ రెడ్డి పాత్ర గుర్తుండిపోతుంది ఆయన చేసిన సేవ గుర్తుండిపోతుంది. జితేందర్ రెడ్డి చరిత్ర ఒక షార్ట్ ఫిలిం గా తీద్దాం అనుకున్న. కానీ తను చేసిన పనులు ప్రజలందరికీ తెలియాలంటే సినిమా తీయాలని ఈ సినిమా నిర్మించాం. ముందు ముందు టీజర్, ట్రైలర్ అదే విధంగా సినిమాతో మీ ముందుకి జితేందర్ రెడ్డి జీవిత కథని చరిత్రగా తీసుకురాబోతున్నాం. చరిత్ర అంటే జరిగిన నిజాన్ని తెలుసుకోవడం అలాంటి ఒక నిజాన్ని జితేందర్ రెడ్డి జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం ఎంత ముఖ్యమో జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవడం కూడా అలాంటిదే. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

యాక్టర్ రవి ప్రకాష్ గారు మాట్లాడుతూ : ఇందులో నా క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చాలా సినిమాలు నటించాను కానీ ఇది కచ్చితంగా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. గ్లింప్స్ చూసిన తర్వాత సినిమా పైన మాకు నమ్మకం పెరిగింది. స్ట్రాంగ్ సోల్ ఉన్న సినిమా ఇది. విరించి వర్మ గతంలో చేసిన సినిమాలు నాకు చాలా ఇష్టం. ఈ క్యారెక్టర్ కి నన్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో రాకేష్ వర్రె మాట్లాడుతూ : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలై మిర్చి బాహుబలి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గర అయ్యి ఎవరికీ చెప్పొద్దు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఎవరికీ చెప్పొద్దు సక్సెస్ కి కారణం ప్రేక్షకులు, మీడియానే. మీడియా సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఏది జరగదు. మీ మీడియా సపోర్ట్ ఉండాలని ఫస్ట్ ఈ గాథరింగ్ తో మొదటి అడుగు మొదలుపెట్టాం. ఈ సినిమా మేము అనుకున్నట్టుగా అవ్వడానికి కారణం నలుగురు మెయిన్ పర్సన్స్. ప్రొడ్యూసర్ ముదుగంటి రవీందర్ రెడ్డి గారు, డైరెక్టర్ విరించి వర్మ, డిఓపి జ్ఞాన శేఖర్ గారు, ఉమా గారు మరియు వాణి గారు. నేను శేఖర్ గారే నన్ను ఈ సినిమాకి సజెస్ట్ చేశారు. అప్పటికే రెండు సినిమాలు ఒప్పుకొన్న నేను విరించి వర్మ చెప్పిన కథ నచ్చడంతో ఆ సినిమాలను పక్కనపెట్టి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారు తన అన్న జితేందర్ రెడ్డి కథని ప్రజలకు చెప్పాలనుకునే తాపత్రయం బాగా నచ్చింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని మంచి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ : నేను గతంలో చేసిన రెండు సినిమాలు లవ్ స్టోరీస్ అండ్ మంచి హ్యూమర్ ఉన్న సినిమాలు. హ్యూమరే కాదు మంచి హ్యూమన్ ఎమోషన్స్ మరియు డ్రామా కూడా నాకు చాలా ఇష్టం. నాన శేఖర్ గారు నాకు కాల్ చేసి ఒక కథ ఉంది డైరెక్ట్ చేయాలి అని చెప్పారు. కథ వినడానికి వెళ్ళినప్పుడు ఒక బుక్ ఇచ్చి చదువుకోమన్నారు. కథ చదివిన తర్వాత ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ నేనే డైరెక్ట్ చేయాలి అనుకున్నాను. అదేవిధంగా జితేందర్ రెడ్డి గారి గురించి తెలుసుకోవడం కోసం ఆయన విలేజ్ కు వెళ్లి ఆయన స్నేహితులతో అక్కడున్న ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యి ఎన్నో విషయాలు తెలుసుకుని ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చాను. కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఒక మంచి కథతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాను. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

Tags:    

Similar News