Josh Director Vasu Varma : డ్రగ్స్ కేసులో అరెస్ట్.. ‘జోష్’ దర్శకుడి వివరణ ఇదీ..
మత్తు పదార్థాల కేసు టాలీవుడ్ సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు కావడం, నటుడు నవదీప్‌ను త్వరలో పోలీసులు విచారించనున్న నేపథ్యంలో ఎప్పుడు ఏ సెలబ్రిటీ పేరు బయటికి వస్తుందోనని ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా నాగచైతన్యతో ‘జోష్’ మూవీ తీసిన దర్శకుడు వాసు వర్మ పేరు బయటికి రావడంతో మరింత మందిని అరెస్ట్ తప్పదని భావిస్తున్నారు. అయితే ఈ కేసుతో తనకు సంబంధమే లేదని, ఇండస్ట్రీలోని మరో దర్శకుడు వాసు వర్మను పోలీసులు అరెస్ట్ చేయగా ఒకే పేరు కావడంతో తనను అరెస్ట్ చేశారని దుష్ప్రచారం చేస్తున్నారని వాసు వర్మ వాపోయారు. దీనికి సంబంధించి ఓ వీడియోలో వివరణ ఇచ్చారు.
పోలీసులు ‘బస్తీ’ దర్శకుడు, సినిమా ప్రొడ్యూసర్ మంతెన వాసు వర్మ, రచయిత మన్నేరి పృథ్వీకృష్ణలు అరెస్ట్ చేసి, వారి దగ్గరి నుంచి 70 గ్రాముల కొకైన్, విదేశీ మద్యం, గంజాయినిస్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వాసు వర్మ దర్శకుడు వాసు వర్మ అని ప్రచారం అవుతోంది. అయితే అరెస్టయింది కాదని ‘జోష్’ డైరెక్టర్ చెప్పారు. ‘‘అరెస్టయిన వాసు వర్మ ఇండస్ట్రీకే చెందిన మరో వ్యక్తి. కానీ నా ఫొటోను వాడి వార్తలు రాశారు. కేసుతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. పొరపాటును దిద్దుకోవాలని కోరుతున్నాను’’ అని వాసు వర్మ చెప్పారు. కాగా మంతెన వాసు వర్మ, పృథ్వీకృష్ణల కేసు జూన్ లో బయటపడింది. అయితే మంతెన వర్మ ఎవరో జనానికి పెద్దగా తెలియకపోవడంతో ‘జోష్’ దర్శకుడి పేరు, ఫొటోలు హల్ చల్ చేశాయి.