Jr NTR: ఆస్కార్ కమిటీ నుంచి.. ఎన్టీఆర్కు అరుదైన గౌరవం

Byline :  Bharath
Update: 2023-10-19 12:21 GMT

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూమెంట్ ఇది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్స్ అయ్యారు ఎన్టీఆర్, రామ్ చరణ్. నాటు నాటు పాటలకు ఆస్కార్ గెలిచి భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని విశ్వవేదికపై ఘనంగా చాటారు. గ్లోబల్ రేంజ్ లో పాపులారిటీని దక్కించుకున్న ఎన్టీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ కమిటీలోని నటుల కేటగిరీలో ఎన్టీఆర్ కు చోటు లభించింది. ఈ విషయాన్ని ఆస్కార్స్ అకాడమీ.. తన సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్ చేసింది. ఎన్టీఆర్ ను కొత్త అకాడమీ మెంబర్ గా పరిచయం చేస్తూ.. నాటు నాటు పాటలోని సీన్ ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది 398 మందికి కొత్తగా ఆస్కార్ ప్యానెల్ లో చోటు కల్పించబోతున్నట్లు.. ఇప్పటికే ఆస్కార్ కమిటీ ప్రకటించింది. దీనికోసం టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్, సెంథిల్, సాయి బాబు సిరిల్ లకు ఇన్విటేషన్లు అందాయి. అంతేకాకుండా వీరితోపాటు మణిరత్నం, కరణ్‌జోహార్‌, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌, చైతన్య తమహానే, షానెక్‌ సేన్‌లకు కూడా ఆస్కార్‌ కమిటీ నుంచి ఇన్విటేషన్ అందింది. భారత కమిటీ సభ్యుడిగా ఎన్టీఆర్ ను ప్రకటించింది ఆస్కార్ కమిటీ. దీంతో ఆస్కార్ కమిటీ సభ్యుడిగా నియమితుడైన తొలి తెలుగు హీరోగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించాడు. ఆస్కార్ ప్యానెల్ లో కొత్తగా ఎంపికైన సభ్యులందరికీ ఆస్కార్ అవార్డ్స్ ఎంపికలో ఓటు వేసే హక్కు ఉంటుంది.


 




Tags:    

Similar News