NTR : ఎన్టీఆర్ ట్రిప్ చేసిన ప్రాంతంలో భూకంపం.. నటుడి దిగ్భ్రాంతి
జపాన్‌లో సంభవించిన భూకంప ఘటనపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. గత వారం జపాన్ పర్యటనకు వెళ్ళిన ఎన్టీఆర్ సోమవారమే తిరిగి వచ్చారు. హాలీడే ట్రిప్‌లో భాగంగా జపాన్ వెళ్ళిన ఎన్టీఆర్ వారం రోజుల పాటు అక్కడే గడిపారు. తను తిరిగి వచ్చిన వెంటనే అక్కడ భూకంపం రావడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా జపాన్‌కు సానుభూతిని ప్రకటించారు. తన గడిపిన ప్రాంతంలోనే భూకంపం రావడం తన హృదయాన్ని కలచివేసిందన్నారు. భూకంప వల్ల నష్టపోయిన ప్రజలు త్వరగా కోలుకోవాలి అంటూ ట్వీట్ చేశారు.
సోమవారం ఉత్తర మధ్య జపాన్‌లో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. పశ్చిమ ప్రాంతాలను వరుస భూకంపాలు వణికించాయి. భూకంప కేంద్రం ఇషికావాలోని నోటో ప్రాంతంలో 37.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం.. 137.2 డిగ్రీల తూర్పు రేఖాంశంలో వాజిమాకు తూర్పు-ఈశాన్యంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రంలో అలలు ఎగసిపడటంతో, దేశంలోని వాయువ్య తీర ప్రాంతంలో సునామీ హెచ్చరిక జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరారు. భూకంపం కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల నుండి డజన్ల కొద్దీ భూకంపాలు సంభవించాయి. భూకంపం కారణంగా ఆరుగురు మరణించగా వందలాది మంది నిరాశ్రయులయ్యారు
Back home today from Japan and deeply shocked by the earthquakes hitting. Spent the entire last week there, and my heart goes out to everyone affected.
— Jr NTR (@tarak9999) January 1, 2024
Grateful for the resilience of the people and hoping for a swift recovery. Stay strong, Japan 🇯🇵