యంగ్ టైగర్ ఎన్టఆర్ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తారక్ సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌజ్ ను ప్రారంభించనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ లో ప్రముఖ హీరోలకు సొంత ప్రొడక్షన్ హౌజ్ లు ఉన్నాయి.
అయితే, కొత్త ట్యాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి.. ఎన్టీఆర్ ఈ ప్రొడక్షన్ హౌజ్ ద్వారా ప్రారంభిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ ప్రొడక్షన్ హౌజ్ లో మొదటి సినిమా నాచురల్ స్టార్ నానితో తీయబోతున్నాడట. అయితే, ఈ ప్రొడక్షన్ హౌజ్ కు ఏ పేరు పెడతాడని ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు.