Kalki 2898 AD: సగం టైం దానికే సరిపోతుంది.. అందుకే మేకింగ్ ఆలస్యం అవుతుంది: డైరెక్టర్
కల్కి 2989 AD.. ఇండియన్ సినిమా ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా. ప్రభాస్ హీరోగా, దీపిక పదుకొణె హీరోయినగా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సినిమా ఇది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో, వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. ఈ ఏడాది వేసవి కానుకగా.. ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే సినిమా టేకింగ్ లో చాలా ఆలస్యం అవుతుందని, దానికి కారణం తామేనని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన ప్రభాస్ అభిమానులు డీలా పడిపోతున్నార. అయితే కల్కి 2989 AD ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే..
‘కల్కీ సినిమా కోసం ప్రతీదాన్ని స్క్రాచ్ నుంచి తయారుచేస్తున్నాం. సింపుల్ గా చెప్పాలంటే.. షూటింగ్ లో సగం టైం ఇంజినీరింగ్ పనికే సరిపోతుంది. మేకింగ్ కన్నా ఆ పనే ఎక్కువగా చేస్తున్నామనే ఫీలింగ్ ఉంది. ఇందులో మీరు భవిష్యత్తు ప్రభాస్ ను చూస్తారు. సెట్స్ తో పాటు ఆయుధాలు, ఇతర వస్తువులన్నీ సరికొత్తగా రూపొందిస్తున్నాం. ఇప్పటి వరకు భారతీయ సినిమాలో చూడని సరికొత్త ప్రపంచాన్ని కల్కీలో చూడబోతున్నార’ని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.